నల్లమల అడవుల్లో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ పునఃప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: మార్కాపురం
నల్లమల అడవుల్లో పర్యాటకులను అలరించేందుకు మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల- శ్రీశైలం రహదారి వెంట ఉన్న జంగిల్ సఫారీ గురువారం పునఃప్రారంభం కానుంది. పులుల సంతానోత్పత్తి కోసం అటవీశాఖ అధికారులు దీనికి మూడు నెలల పాటు విరామం ప్రకటించిన విషయం విదితమే. పర్యాటకులు నల్లమల ప్రత్యేకతను తెలుసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇష్టకామేశ్వరదేవి దర్శనానికి కూడా తగిన అనుమతులు మంజూరు చేశారు.