రామాయణం సినిమాపై రిషబ్ శెట్టి ప్రశంసలు: చరిత్ర సృష్టించాలని ఆకాంక్ష

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణంపై కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతిని గొప్ప స్థాయిలో వెండితెరపైకి తీసుకురావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించాలని, ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాలని రిషబ్ శెట్టి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.