మున్సిపల్ ఎన్నికల అక్రమాలపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో నిప్పులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా కాలరాసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్ వరకు ప్రతి దశలోనూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడంతో పాటు ఓటింగ్ శాతంలోనూ మార్పులు చేసి లెక్కలను తారుమారు చేశారని జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.