భత్కల్ లో మసీదుపై రాళ్ల దాడి ఉద్రిక్తత
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Karnataka
కర్ణాటకలోని భత్కల్ లో బుధవారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా మసీదుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. గుల్మి ప్రాంతంలోని మస్జిద్-ఇ-ఇస్మాయిల్ పై జరిగిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వమాయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు వెంటనే అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉత్తర కన్నడ ఎస్పీ దీపన్ ఎంఎన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.