స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుగుదేశం పార్టీలో వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారసులను రాజకీయంగా నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఈనాడు అమరావతి ప్రతినిధి తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు మహిళలకు కేటాయించిన నియోజకవర్గాల్లో కొందరు నేతలు తమ భార్యలు, కుమార్తెలు, కోడళ్లను రంగంలోకి దించుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం రానివారు, పదవులు దక్కని నాయకులు ఈ ఎన్నికలను తొలి మెట్టుగా భావిస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.