సింహాచలం కొండపై పర్యావరణ విధ్వంసం బట్టబయలు
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షాలకు సింహాచలం కొండపై జరుగుతున్న పర్యావరణ విధ్వంసం వెలుగులోకి వచ్చింది. డేటా సెంటర్ పేరుతో వేలాది చెట్లను నరికివేయగా, భారీ వర్షానికి డేటా సెంటర్ ప్రహరీ గోడ, పరదాలు, రేకులు కూలిపోయాయి. గిరి ప్రదక్షిణ రోజున బయట ప్రపంచానికి తెలియకుండా ఈ అక్రమ తతంగం నడిపినట్లు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.