సత్తుపల్లి మండలంలో విషాదం.. ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సత్తుపల్లి

సత్తుపల్లి మండలంలోని గంగారానికి చెందిన ఇంటర్ విద్యార్థి చరణ్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్ రెడ్డి మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.