బెల్లంపల్లి బూడిదగడ్డలో దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ సంకీర్తన్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీలో దుర్గాభవాని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తన్ సందర్శించారు. ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ రాజనాల బడికల రమేష్ ఆహ్వానం మేరకు మండపానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.