గుడిపేటలో బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఒకరు అక్కడికక్కడే బలి
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట బస్ స్టాప్ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న గుడిపేటకు చెందిన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.