వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన అనిత
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పెట్లమ్మ శంకర్ గణేష్, చింతకాయల జమ్మిలతో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.