కేసీఆర్‌ చాలా మంచి వ్యక్తి, ఆయనలో ఎంతో హుందాతనం ఉంది

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కేసీఆర్‌ ఎంతో హుందాతనంతో ఉండేవారని, తమను ఎప్పుడూ గౌరవంగానే చూసేవారని ఆమె కొనియాడారు. తాము అడగగానే కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తుచేస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆప్యాయతను సురేఖ ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.