సీట్లు ఎవరి బిచ్చం కాదు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: Andhra Pradesh
సీట్లు ఎవరో ఇచ్చే బిచ్చం కాదని, స్వశక్తితో సాధించుకోవాల్సిన హక్కు అని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పొత్తుల్లో భాగంగా సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా, డిమాండ్ చేసిన స్థానాలు దక్కకపోయినా క్యాడర్ మాత్రం స్నేహపూర్వక పోటీకి సైతం వెనుకాడవద్దని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక వాటా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.