తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని పాలకులపై పెరిగిన ఒత్తిడి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబరు 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర నాయకుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం చౌటుప్పల్ లోని పద్మ వంశీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విముక్తి లభించిందన్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించిన విమోచన దినానికి అధికారిక గుర్తింపు కల్పించాలని కోరారు.