ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సర్వం సిద్ధం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా తొంబై రెండు పురపాలక సంస్థల్లో ఓట్ల లెక్కింపు కోసం నూట ముప్ పై ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ప్రక్రియ నిర్వహణకు మొత్తం నలభై ఏడు వేల మందికి పైగా సిబ్బందిని అధికారులు నియమించారు.