తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు సమకూర్చిన వివిధ సంస్థలు
రిపోర్టర్: సురేష్
స్థలం: దిల్లీ
తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాలు వచ్చాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పి అశోక్ బాబు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. ప్రుడెంట్ ఎలెక్టోరల్ ట్రస్ట్ ద్వారా అత్యధికంగా నలభై ఐదు కోట్ల రూపాయలు అందగా వీపీఆర్ మైనింగ్ సంస్థ ఐదు కోట్ల రూపాయల విరాళం అందించినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.