తీవ్ర తుపాను ముప్పు: ఏపీలో ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విశాఖపట్నం

అర్నబ్ తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, మన్యం, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈనెల ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది తేదీల్లో సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.