మెక్సికోతో వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటున్న కెనడా
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. మెక్సికోతో వాణిజ్య సంబంధాలను మరింత గట్టిగా మార్చుకోవాలని నిర్ణయించింది. కెనడా మంత్రి డొమినిక్ లెబ్లాంక్ మాట్లాడుతూ, అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పంద సమీక్ష కోసం మూడు దేశాలు ఒకే టేబుల్ వద్దకు రావాలని స్పష్టం చేశారు. స్టీల్, ఆటోమొబైల్ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.