సింగరేణి కార్మికులకు తీపి కబురు: లక్షా పదివేల బోనస్ ప్రకటన
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఒక్కొక్కరికి లక్షా పది వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశాభివృద్ధిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, తెలంగాణకు సింగరేణి కొంగు బంగారమని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు బకాయిపడిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.