యూవా సంగమ్ ఫేజ్ 7: అసోమ్ గవర్నర్ను కలిసిన తెలంగాణ విద్యార్థుల బృందం

రిపోర్టర్: సురేష్ స్థలం: Telangana / Assam

యువ సంగమ్ ఏడవ విడత కార్యక్రమంలో భాగంగా అసోమ్ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్యను తెలంగాణ విద్యార్థుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ సమావేశంలో విద్యార్థులు పలు అంశాలపై చర్చించారని, గవర్నర్ అందించిన విలువైన సలహాలు తమ సాంస్కృతిక అవగాహనను మరింత పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ఆ బృందం స్పష్టం చేసినట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది.