మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట: ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఇరవై ఐదు కోట్లు కేటాయింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లోని ప్రజాభవ లో మైనార్టీ సంక్షేమ శాఖపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాంపల్లి లోని హజ్ హౌస్ పక్కన అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. విదేశీ విద్య కోసం ఈజిప్ట్, సౌదీ అరేబియాలను ఓవర్సీస్ స్కాలర్ షిప్ పరిధిలోకి తెస్తామన్నారు.