చేనేత పింఛన్ల కోసం అనధికార పత్రాల జారీ కలకలం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం ఉమ్మడి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా చేనేత పింఛన్ల కోసం అనధికారిక పత్రాలు జారీ అవుతున్నాయి. ఎలాంటి మగ్గం లేనివారికీ రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేసి సొసైటీలు సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. లంచాలు చేతులు మారుతుండటంతో పాటు కొందరు నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ దరఖాస్తుల దందాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.