మహిళలు బాలికల భద్రతకు నెల్లూరు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాలలో శక్తి యాప్, ఆపరేషన్ చిన్నారి తల్లి, అలాగే ఆపరేషన్ దండాయనపై విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.