పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో లైన్స్ క్లబ్ ఆఫ్ పలాస పాలబుగ్గ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు చిన్నారులకు, స్థానికులకు ఉచితంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలనే పూజించాలనే సందేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. జల వనరులను కాపాడాలని పిలుపునిచ్చారు.