'గంజాయితో జీవితాలు నాశనం': అల్లూరి పోలీస్ హెచ్చరిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: అల్లూరి సీతారామరాజు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు, రవాణా వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ అల్లూరి పోలీస్ కీలక ప్రకటన చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి రవాణాకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకోవద్దని కోరారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం తనిఖీలతో పాటు ప్రత్యేక నిఘా ఉంచామని, గంజిత రహిత సమాజమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపడుతున్నామని అల్లూరి పోలీస్ స్పష్టం చేశారు.