మంచిర్యాలలో ప్రాణదాతలుగా నిలిచి ఆదర్శం చాటిన రక్తదాతలు మరియు పోలీసులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాలలో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. డీసీపీ ఏ. భాస్కర్ ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రక్తం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.