ఎన్నికల శంఖారావం మోగించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఎన్నికలకు సమాయత్తం కావడంపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై సీనియర్ నేతలు దిశానిర్దేశం చేశారు.