రష్యా భీకర డ్రోన్ దాడి: ఉక్రెయిన్లో 13 మంది పౌరులు దుర్మరణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: డ్నిప్రో

ఉక్రెయిన్లోని డ్నిప్రో రైల్వే స్టేషన్పై రష్యా బలగాలు జరిపిన భీకర డ్రోన్ దాడిలో పదమూడు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ప్రయాణికులతో ఆగివున్న రైలుపై ఈ దాడి జరగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వెల్లడించింది.