ఫ్లైదుబాయ్ విమాన కూల్చివేత కుట్ర: ఇద్దరు మాల్దీవుల పైలట్ల అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: దుబాయ్
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు యత్నించిన ఉదంతంలో యూఏఈ పోలీసులు ఇద్దరు మాల్దీవుల పైలట్లను అదుపులోకి తీసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కుట్ర వెనుక పెద్ద తతంగం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడైన ఒమన్ కో-పైలట్‌తో ఈ అరెస్టయిన ఇద్దరికి సాన్నిహిత్యం ఉన్నట్లు తేలిందని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని యూఏఈ అధికారులు తెలిపారు.