స్వయం ఏపీ బ్రాండ్‌ పేరుతో మార్కెట్‌లోకి డ్వాక్రా ఉత్పత్తులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

డ్వాక్రా మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించి సెర్ప్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో పట్టణ మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని 65 ఉత్పత్తులను ఎంపిక చేశారు. దసరా నాటికి స్వయం ఏపీ బ్రాండ్‌ పేరుతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ-కామర్స్ ద్వారా విక్రయాలు చేపట్టనున్నారు.