ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ దానం నాగేందర్ సవాల్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
తెలంగాణ రాజకీయాల్లో హైకోర్టు తీర్పు సంచలనం సృష్టించిన వేళ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన అసలు లేదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని, ఎన్నికల్లో కొట్లాడడానికే తాను సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ సవాల్ విసిరారు.