ఏపీ జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్ సీతారాం గోయల్ నియామకం
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుగా అశోక్ సీతారాం గోయల్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఎక్స్ అఫీషియో అదనపు కార్యదర్శిగా, రివర్ మేనేజ్మెంట్ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన నియామక కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. ఢిల్లీలో ఉంటూనే కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో ఆయన ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు.