అమెరికా నుంచి వచ్చి కుటుంబంతో కలిసి గణేష్ పూజలు నిర్వహించిన గోవిందా
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా, కుటుంబ సభ్యులతో కలిసి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రి వేళ ఇంటికి చేరుకున్నప్పటికీ, పిల్లలు టీనా అహుజా, యశ్వర్ధన్ అహుజాలతో కలిసి ఆయన గణపతి దర్శనం చేసుకున్నారు. తన తల్లి కాలం నాటి నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం ఆనందంగా ఉందని, కొడుకు మంచి భవిష్యత్ సాధించాలని కోరుకున్నారు.