భారత్లో ఆగస్టులో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే!
రిపోర్టర్: హరి
స్థలం: India
భారత కార్ల మార్కెట్లో ఆగస్టు నెలలో విక్రయాలు జోరందుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన మొత్తం అమ్మకాలు 33 శాతం పెరిగి 1,83,037 యూనిట్లకు చేరాయి. టాటా పంచ్ తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, ఫ్రాంక్స్, ఎర్టిగా, టాటా నెక్సాన్, డిజైర్, హ్యుందాయ్ క్రెటా, బలెనో, మహీంద్రా స్కార్పియో మోడల్స్ టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.