షరియత్ కోర్టులకు చట్టబద్ధత లేదు: ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఛత్తీస్గఢ్
సివిల్ మరియు వైవాహిక వివాదాలను పరిష్కరించేందుకు షరియత్ కోర్టులకు లేదా మతపరమైన సంస్థలకు ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేదని ఛత్తీస్గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. అనధికారిక వేదికలు జారీ చేసే ఫత్వాలు లేదా నిర్ణయాలకు ఎలాంటి చట్టపరమైన చెల్లుబాటు ఉండదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజ్యాంగబద్ధమైన కోర్టుల అధికారాలను ఏ ప్రైవేట్ సంస్థ కూడా చేజిక్కించుకోలేదని ధర్మాసనం వెల్లడించింది.