హరిద్వార్ కుంభమేళా 2027: జనవరి 14 నుంచి పవిత్ర స్నానాలు ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: హరిద్వార్
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 2027లో జరగనున్న కుంభమేళాకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని మేళా అధికారులు తెలిపారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా తొలి పవిత్ర స్నానం ప్రారంభంకానుండగా, ఏప్రిల్ 20న చైత్ర పూర్ణిమతో చివరి స్నానం ముగియనుంది. ఈ ఉత్సవానికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో పదకొండు స్నానాల తేదీలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో మేళా ప్రాంతాన్ని నాలుగు జిల్లాలు, ముప్పై రెండు సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.