కోల్కతాలో టీఎంసీ ఐటీ సెల్ చీఫ్ ఇళ్లపై దాడులంటూ ఆరోపణ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: కోల్‌కతా

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ముకుంద్పూర్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో తమ పార్టీ ఐటీ సెల్ చీఫ్ ఉపాసన చౌదరి ఇల్లు దాడికి గురైందని టీఎంసీ నేత హుమాయున్ కబీర్ తెలిపారు. సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో తనకు ఈ దాడి గురించి సమాచారం అందిందని, వెంటనే ఆమెను వివరాలు పంపాల్సిందిగా కోరినట్లు ఆయన మీడియాకు వివరించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.