ఎన్నికల తర్వాత పార్టీలు మారిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధుల ఉదంతాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ సంచలన నివేదికను వెల్లడించాయి. 2022 నుంచి 2026 మధ్య దేశవ్యాప్తంగా 111 మంది ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వేర్వేరు పార్టీలు మారినట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. ఇందులో 26 మంది లోక్సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆ నివేదిక ద్వారా అధికారులు స్పష్టం చేశారు.