తుఫాన్ ముప్పుతో తీవ్ర ఆందోళనలో కుక్కునూరు మండల రైతన్నలు

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కుక్కునూరు మండల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరదలు, వర్షాభావం దృష్ట్యా ఈ ఏడాది రైతులు అధికంగా మిర్చి, పత్తి సాగుకు సిద్ధమై కొందరు నారు కూడా నాటారు. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరి వరద ముప్పు వెంటాడుతుండటంతో పెట్టిన పెట్టుబడులు ఎక్కడ నష్టం వస్తుందో అని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.