పాలమూరు నీటి అన్యాయంపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన హరీష్ రావు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్‌నగర్
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి నిర్వహణలో విఫలమైందని, కృష్ణా జలాల వినియోగంలో చేతగానితనం వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంకు నీటిని తీసుకెళ్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాను ఎండబెడుతున్నారని ఆరోపించారు. 88 టీఎంసీల నీళ్లు వాడినట్టు చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడ వాడామో శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.