లండన్ లోని వెల్ చైల్డ్ అవార్డ్స్ వేదికపై ప్రిన్స్ హ్యారీని హత్తుకున్న చిన్నారి
రిపోర్టర్: అశోక్
స్థలం: లండన్
లండన్ లో జరిగిన వెల్ చైల్డ్ అవార్డ్స్ వేదికపై ఆరు సంవత్సరాల మార్గోట్ జోన్స్ బిల్లింగ్టన్ అనే చిన్నారి ప్రిన్స్ హ్యారీని ఆప్యాయంగా కౌగిలించుకున్న క్షణాలు వైరల్ గా మారాయి. మెదడు రక్తస్రావం నుంచి కోలుకున్న ఈ చిన్నారికి హ్యారీ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. ప్రిన్స్ హ్యారీ దివంగత ప్రిన్సెస్ డయానా లాగే పిల్లలతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.