నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో భారీ వరదలు: 1300 మంది మృతి

రిపోర్టర్: గోపి స్థలం: World

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో 1,300 మందికి పైగా మరణించగా, 5,000 మంది గల్లంతయ్యారు. వరదల్లో 275 మంది భారతీయులు చిక్కుకోగా, రక్షణ దళాలు ఇప్పటివరకు 166 మందిని సురక్షితంగా కాపాడాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది.