ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి.. మరో 41 స్థానిక సంస్థలకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎస్ఈసీ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర్ పంచాయతీలు ఉన్నాయి. జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుని ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.