చండీగఢ్‌లో మహిళలకు ఉచిత ఐఫోన్ల పంపిణీకి అనుమతి నిరాకరణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: చండీగఢ్
చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త రాకేశ్ ట్రెహాన్ మహిళలకు ఉచితంగా ఐఫోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించగా భద్రతా కారణాల రీత్యా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. దీంతో బహిరంగ ప్రదేశంలో నిర్వహించాల్సిన ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఆయన తన నివాసంలోనే మీడియా సమక్షంలో నిర్వహించి పది మంది మహిళలను విజేతలుగా ఎంపిక చేసి ఐఫోన్లను అందజేశారు.