నెల్లూరులో విద్యుత్ బస్సుల గ్యారేజీ పనులు: నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
విద్యుత్తు బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసి నెల్లూరు రెండు డిపో గ్యారేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లు మరియు సాంకేతిక వసతుల కల్పన పనులను నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ డీఈ సుభూషన్ తెలిపారు. జిల్లాకు వంద విద్యుత్ బస్సులు రానుండటంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని జిల్లా ప్రజా రవాణా అధికారి షమీమ్ వెల్లడించారు. పనులు పూర్తయితే డిసెంబరులో బస్సులు వచ్చే అవకాశం ఉంది.