నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ

రిపోర్టర్: గోపి స్థలం: నారాయణపేట

నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసినట్లు ఎస్పీ నారాయణపేట (SP Narayanpet) వెల్లడించారు. ఈ తనిఖీలో భాగంగా స్టేషన్ రికార్డులు, సిసిటిఎన్ఎస్ నమోదులను, కేసుల దర్యాప్తు పురోగతిని, పెండింగ్ కేసుల స్థితిగతులను డీఎస్పీ నల్లపు లింగయ్య క్షుణ్ణంగా పరిశీలించారు. బీట్ పోలీసింగ్ తీరును, నిఘా కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును సమీక్షించారు. సిబ్బంది విధి నిర్వహణపై పలు సూచనలు చేస్తూ, శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, ప్రజా ఫిర్యాదులపై ఎల్లప్పుడూ తక్షణమే స్పందించాలని ఆదేశించారు.