టెక్ ప్రపంచంలో సంచలనం: వచ్చే ఏడాది రెట్టింపు స్మార్ట్ఫోన్లను తేనున్న నథింగ్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఢిల్లీ

వచ్చే ఏడాది మార్కెట్లోకి రెట్టింపు సంఖ్యలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు నథింగ్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అకిస్ ఇవాంజెలిడిస్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని తమ సంస్థ ప్రధాన కార్యాలయంలో త్వరలో నిర్వహించనున్న ప్రత్యేక సహ-సృష్టి కార్యక్రమంలో ఈ కొత్త పరికరాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రాబోయే మోడళ్లకు సంబంధించి వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు ఆయన గురువారం వెల్లడించారు.