హైదరాబాద్లో మోదీ సేవాగాథ కార్యక్రమం: చిన్నారులతో కలిసి కిషన్ రెడ్డి భాగస్వామ్యం
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని బర్కత్పురలో ఉన్న భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహించిన మోదీ సేవాగాథ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆకట్టుకుందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానాన్ని ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని ఆయన పేర్కొంటూ ఈ విశేషాలను ప్రజలతో పంచుకున్నారు.