ఖైరతాబాద్ బడా గణేష్ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం, రద్దీ నియంత్రణపై పోలీసు సిబ్బందితో చర్చించి పలు కీలక సూచనలు చేశారు.