తీపి కబురు: వచ్చే ఏడాది పట్టాలపైకి దేశ తొలి బుల్లెట్ రైలు

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోందని, దేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు తయారీ పూర్తి కావచ్చిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ కలలో భాగంగా తయారవుతున్న ఈ రైలు ఫస్ట్ బాడీ ఫ్రేమ్ పనులు ముగిశాయని తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి ఈ హైస్పీడ్ రైలు ట్రయల్స్ కోసం పట్టాలపైకి రానుందని ఆయన స్పష్టం చేశారు.