నేడు రోలుగుంట మండలంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పర్యటన

రిపోర్టర్: G TAMMUNAIDU స్థలం: రోలుగుంట

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ నేడు గురువారం విస్తృతంగా పర్యటించనున్నారు. ముందుగా కంచుగమ్మల గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా పంపిణీ చేయనున్నారు. అనంతరం అడ్డసరం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం రోలుగుంట కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల మధ్యాహ్న భోజన నాణ్యతను అధికారులతో కలిసి తనిఖీ చేస్తారు. ఆ తర్వాత కొవ్వూరు, కొమరవోలు, కుసర్లపూడి గ్రామాల్లో సాగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని మండల అధికారులు వెల్లడించారు.